Home Default విమానం కుప్పకూలి తొమ్మిదిమంది దుర్మరణం..

విమానం కుప్పకూలి తొమ్మిదిమంది దుర్మరణం..

 

చెంబర్లీన్: ఓ విమానం కుప్పకూలి తొమ్మిదిమంది మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ డకోటాలోని చెంబర్లీన్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్‌, ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది విమానంలో ఉన్నారు. సమాచారం అందుకున్న నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చెంబర్లీన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిట్లు అధికారులు పేర్కొన్నారు.

9 killed after plane crash in South Dakota