Home జయశంకర్ భూపాలపల్లి విషపు నీళ్లు తాగి 7 గొర్రెలు, 2 మేకలు మృతి ?

విషపు నీళ్లు తాగి 7 గొర్రెలు, 2 మేకలు మృతి ?

9 Sheep

 

 

మన తెలంగాణ/ ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రానికి సమీపంలో దయ్యాల వాగు పరివాహక ప్రాంతంలో మంగళవారం గంపల గూడెం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులకు చెందిన 7 గొర్రెలు, 2 మేకలు మృతి చెందాయి. గొర్రెల కాపరుల కథనం ప్రకారం…. ఉదయం నుంచి గొర్రెలను దయ్యాల వాగు పరివాహన ప్రాంతంలో మేపుతుండగా ఆకస్మాత్తుగా కొన్ని గొర్రెలు క్రింద పడి కొట్టుకుంటు చూస్తుండగానే మృతి చెందాయని తెలిపారు. వెంటనే మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ కు సమాధానం అందించగా ఆయన వెంటనే స్పందించి మిగతా వాటికి చికిత్స అందించడంతో ప్రాణ పాయం తప్పిందని వారు పేర్కొన్నారు. విషపు నీరు లేదా విషపు ఆహారం కానీ ఏదో తీసుకోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని వారు తెలుపుతున్నారు. పది మంది గొర్రెలకు సంబంధించిన సుమారు 600 గొర్రెలు ఒకే చోట మేపుతుండగా ఈ సంఘటన జరిగింది. కేవలం 9 గొర్రెలతోనే ఈ నష్టం ఆగిపోవడంతో గొర్రె ల కాపర్లు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 70 వేల రూపాయల నష్టం వాటిల్లిందని పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. చనిపోయిన గొర్రెలకు ఆయన పోస్టు మార్టం నిర్వహించారు. గొర్రెల కాపరులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు.

 

9 Sheeps Suspicious Death in Mulugu