Home తాజా వార్తలు మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 14మంది కూలీలు మృతి

మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 14మంది కూలీలు మృతి

 

మహబూబ్‌నగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 14 మంది కూలీలు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేేసుకుంది. కూలి పనులు ముగించుకుని ఆటోలో తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

9 workers killed in road accident in Midjil