Friday, April 19, 2024

బయోలాజికల్ ఇ టీకాకు 90 శాతం సమర్థత

- Advertisement -
- Advertisement -

90 percent efficacy for biological e vaccine

 

న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చేసిన టీకాలు కరోనా నియంత్రణలో సమర్ధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్ తన సమర్ధతను నిరూపించుకోగా, తాజాగా మరో దేశీయ టీకా తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఇ (బిఇ) తయారు చేస్తోన్న కార్బివాక్స్ టీకా 90 శాతం పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలనే విడుదలైన నొవావాక్స్ టీకా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. భారత్ లోనే ఏటా దాదాపు వంద కోట్ల డోసులు ఉత్పత్తి కానున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో మూడో దశ ట్రయల్‌కు సిద్ధమైన బయోలాజికల్ ఇ టీకా కూడా ఇదే విధమైన ఫలితాలు అందిస్తోందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా చెప్పారు. అక్టోబర్ నాటికి ఈ టీకా అందుబాటు లోకి రావచ్చు. వీటితోపాటు భారత్‌లో మరో రెండు టీకాలు తుది దశ ట్రయల్స్‌లో ఉన్నాయని అరోరా పేర్కొన్నారు. జైడస్ క్యాడిలా తోపాటు పుణెకు చెందిన జెన్నోవా ఫార్మా తయారు చేసిన టీకా రెండో దశ ట్రయల్స్‌లో ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి ఇవి కూడా అందుబాటు లోకి రావచ్చు. కార్బివాక్స్ టీకాపై హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పుడు మూడోదశ ట్రయల్స్‌కు సిద్ధం కాగా, జులై నాటికి ఇవి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

23 న ప్రపంచ ఆరోగ్య సంస్థతో భారత్ బయోటెక్ భేటీ

కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంద. ఈమేరకు అనుమతులపై డబ్లుహెచ్‌ఒతో ఈనెల 23న ప్రీ సబ్మిషన్ పై సమావేశం కానున్నది. అత్యవసర వినియోగ జాబితా (ఇయుఎల్) కోసం అవసరమైన 90 శాతం డాక్యుమెంట్లను సమర్పించినట్టు గతం లోనే ఈ సంస్థ వెల్లడించింది. మిగతా పత్రాలను ఈ నెల లోనే అందచేయాల్సి ఉంది. ఇండియన్ మెడికల్ రీసెర్చి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించ వలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News