Wednesday, September 18, 2024

గ్రేటర్‌లో 90శాతం సెకండ్ డోసు పంపిణీ

- Advertisement -
- Advertisement -
90 Percent second dose completed in Greater
బస్తీలు,కాలనీల్లో ఇంటింటి తిరిగి టీకా వేస్తున్న వైద్యసిబ్బంది
ఐదారు రోజుల్లో వందశాతం పూర్తి చేస్తామంటున్న జిల్లా వైద్యశాఖ
టీకాపై నిర్లక్ష్యం చేస్తే వైరస్ సోకితే కోలుకోవడం కష్టమని సూచనలు
సెకండ్ డోసు తీసుకోని వారంతా వెంటనే తీసుకోవాలని వైద్యశాఖ సూచనలు

హైదరాబాద్: నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యశాఖ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేసింది. గత పక్షం రోజుల నుంచి ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి తిరిగి డోసు తీసుకోని వారిని గుర్తించి టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్న వారిలో 90శాతం మంది సెకండ్ డోసు తీసుకున్నట్లు, మిగతా 10శాతం మందికి ఐదారు రోజుల్లో పూర్తి చేస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వైరస్ విస్తరించకుండా ప్రజలకు అవగాహన చేసేందుకు వార్డుకు, నోడల్ అధికారుల పర్యవేక్షణలో కాలనీకి ఐదుగురు సిబ్బంది ఆశావర్కర్, ఎఎన్‌ఎం, రిసోర్స్‌పర్సన్, ఎస్‌జే, ఎస్‌ఎఫ్‌ఏలు డ్రైవ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వైద్య సిబ్బంది నిర్వహించే వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమానికి స్దానిక ప్రజలు సహకరించాలని, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు రెండో డోసు అవసరమైన వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు మొదటి డోసు 1,15, 84, 260 మంది తీసుకోగా, సెకండ్ డోసు హైదరాబాద్ జిల్లాలో 32, 18, 350 మంది, రంగారెడ్డి జిల్లాలో 29,74, 520 మంది, మేడ్చల్ జిల్లాలో 28, 57, 890మంది తీసుకున్నట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొదటి డోసు నగరంలో తీసుకున్న వారిలో 20శాతం మందికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తీసుకున్నట్లు ఇంటింటి సర్వేలో పలువురు చెప్పినట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్స్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రస్తుతం 05 లక్షల డోసులు సిద్దంగా ఉన్నట్లు వాటి ద్వారా 10 లక్షలమందికి టీకా పంపిణీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. నగరంలో రోజుకు 1.50లక్షల మందికి టీకా వేసేలా సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో నగరవాసులు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రాల క్యూ కడుతున్నారని, ఇదే విధంగా ప్రజలు స్పందిస్తే అనుకున్న సమయంలో వందశాతం టీకా పంపిణీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చలి తీవత్ర పెరగడంతో వైరస్ విజృంభించే చాన్స్ ఉందని, ఆరు వారాల పాటు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఫిబ్రవరి తరువాత థర్డ్‌వేవ్ అనుకూలంగా ఉందని అప్పటివరకు ముఖానికి మాస్కులు, భౌతికదూరం ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News