Thursday, March 28, 2024

ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో 90 శాతం సానుకూల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

90% positive results in Pfizer vaccine trials

 

న్యూఢిల్లీ : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ బయోటెక్ సంస్థ బయో ఎన్ టెక్ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌లో 90 శాతానికి పైగా సానుకూల ఫలితాలు లభించాయని ఫైజర్ ప్రకటించింది. భారీ ఎత్తున నిర్వహించిన ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు సాధించిన మొదటి వ్యాక్సిన్ తయారీ సంస్థలుగా ఈ రెండు సంస్థలు రికార్డు సాధించాయి. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్న సంస్థలు పది వరకు ఉన్నాయి. వీటిలో నాలుగు సంస్థలు భారీ ఎత్తున ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల తరువాత అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ రెడీ అవుతుందని ఫైజర్ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News