Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అరటి గెలలు తరలిస్తున్న లోడులో గంజాయి పట్టివేత

అరటి గెలలు తరలిస్తున్న లోడులో గంజాయి పట్టివేత

 

 Ganja

 

అమరావతి: అరటి గెలల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాకలోని సత్తయ్యపాలెంలో జరిగింది. అరటి గెలల లోడుతో వెళ్తున్న లారీలో పోలీసులు తనిఖీలు చేశారు. అరటి గెలల కింద ఉన్న గంజాయి పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దాదాపుగా 900 కిలోల వరకు ఉంటుందని పోలీసులు  పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

 

900 KG’s Ganjas Captured in Andhra Pradesh