Home జాతీయ వార్తలు 918 మందికి కరోనా… మృతులు 20

918 మందికి కరోనా… మృతులు 20

Coronavirus-Cases

 

మహారాష్ట్రలో అత్యధికంగా 180 కేసులు

న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి 918కు చే రింది. మృతుల సంఖ్య 20 గా నిర్థారణ అయింది. ఈ విషయాన్నిశనివారం వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కేరళలో ఒకరు, గుజరాత్‌లో ఇద్దరు కరోనాతో మృతి చెందడంతో దేశవ్యాప్త మృతుల సంఖ్య పెరిగి 20కి చేరుకుంది. ఉదయం 9.30 గంటల వరకూ నమోదైన గణాంకాల ప్రాతిపదికన అధికారులు ఈ విషయం వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పుడు రాష్ట్రా ల వారిగా చూస్తే మహారాష్ట్రలో 5, గుజరాత్‌లో 3, కర్నాటకలో 2, మధ్యప్రదేశ్‌లో 2, తమిళనాడు, బీహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో 1 చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి.

ఇప్పుడు కరోనా సోకిన వారిలో 47 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటివరకూ మహారాష్ట్రలోనే అత్యధికంగా 180 మందికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. తరువాత కేరళలో కేసులు 173కు చేరాయి. వీరిలో ఎనమండుగురు వేరే దేశస్తులు ఉన్నారు. కర్నాటకలో 55, తెలంగాణలో 48 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో పది మంది విదేశీయులు ఉన్నారు. రాజస్థాన్‌లో కరోనా వచ్చిన వారి సంఖ్య 48కు చేరుకుంది. గుజరాత్‌లో 45గా రికార్డు అయింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా 45 మందికి కరోనా సోకింది. వీరిలో ఒక విదేశీ వ్యక్తి ఉన్నారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 14కు చేరుకుంది. బీహార్‌లో తొమ్మండుగురికి కరోనా వచ్చింది.

918 Coronavirus Positive Cases in India