Saturday, April 20, 2024

కొత్త కేసులు 945

- Advertisement -
- Advertisement -

945 corona positives registered in Telangana

 

వైరస్ దాడిలో మరో ఏడుగురు మృతి
జిహెచ్‌ఎంసిలో 869, జిల్లాల్లో 76 మందికి వైరస్
16339కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
260కి పెరిగిన కోవిడ్ మరణాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 945 పాజిటివ్‌లు నమోదు కాగా, వైరస్ దాడిలో ఏడుగురు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 869 మంది ఉండగా, జిల్లాల్లో 76 మంది ఉన్నట్లు ప్రకటించారు. అయితే వైరస్ దాడిలో మరణించిన వారు ఎవరు అనేది తెలియపరచలేదు. కొత్తగా వచ్చిన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 869 కేసులు, రంగారెడ్డి 29, మేడ్చల్ 13, సంగారెడ్డి 21,కరీంనగర్ 2, సిద్దిపేట్ 1, నిర్మల్ 4, మహబూబ్‌నగర్ 2, సూర్యాపేట్ 1, ఖమ్మం 1, వికారాబాద్ 1, నిజమాబాద్‌లో మరోకటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 16339కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 7294కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 8785 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 260కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ఒకే రోజు 3457 మందికి టెస్టులు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 945 మందికి వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. అంటే పాజిటివ్ రేట్ 27.3 వచ్చింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మంగళవారం పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు…..

జిల్లా. కేసుల సంఖ్య
జిహెచ్‌ఎంసి 869
రంగారెడ్డి 29
మేడ్చల్ 13
సంగారెడ్డి 21
కరీంనగర్ 2
సిద్దిపేట్ 1
నిర్మల్ 4
మహబూబ్‌నగర్ 2
సూర్యాపేట్ 1
ఖమ్మం 1
వికారాబాద్ 1
నిజమాబాద్ 1
మొత్తం 945

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News