Home తాజా వార్తలు తెలంగాణ‌లో 970 పోస్టల్ ఉద్యోగాలు

తెలంగాణ‌లో 970 పోస్టల్ ఉద్యోగాలు

Postal Jobsహైదరాబాద్ : తెలంగాణ‌ పోస్టల్ స‌ర్కిల్‌లో 970 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు.  ఆన్‌లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువును నవంబరు 15 వరకు విధించారు.

970 Postal Jobs In Telangana