Wednesday, April 24, 2024

భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9887 New Covid19 Cases And 294 Deaths in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కోవిడ్-19 కేసులు, 294 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇండియా క‌రోనా పాజిటివ్ కేసులు 2.35 ల‌క్ష‌లు దాటాయి. పాజిటివ్ కేసుల సంఖ్య‌లో ఇట‌లీని భారత్ దాటేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,942 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,14,073 నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో కరోనాతో 6,642 మరణించగా.. దేశంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,36,657కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మహారాష్ట్ర కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇపట్పివరకు 80,229మందికి కోవిడ్ సోకింది. ఈ వైరస్ బారిన పడి 2,849మంది చనిపోయారు. తమిళనాడు,ఢిల్లీ, గుజరాత్ లలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు 67.69 మందికి కరోనా సోకగా… 3.95 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో 19.33 మందికి కరోనా బారిన పడగా… 1.10లక్షల మంది మృత్యువాత పడ్డారు.

9887 New Covid19 Cases And 294 Deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News