Wednesday, April 24, 2024

రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9971 new covid 19 cases and 287 deaths in india

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో 9971 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 287 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియాలో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత్ లో 1,20,406 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 1,19,293 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఈ వైరస్ మహమ్మారి బారినపడి 6,929 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 2,46,628కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో  పేర్కొంది. దేశంలో కరోనా కేసులు రెండున్నర లక్షలకు చేరువలో ఉన్నాయి. మహారాష్ట్రలో 85వేలకు కరోనా కేసులు చేరువయ్యాయి. ఈశాన్య భారతంలోనూ విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియా కరోనా మృతుల సంఖ్య 7వేలకు చేరువలో ఉంది. ఇప్పటికే కరోనా కేసుల్లో స్పెయిన్ ను భారత్ వెనక్కినెట్టింది.

9971 new covid 19 cases and 287 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News