Saturday, April 20, 2024

వీసాల కోసం తొక్కిసలాట.. 11మంది మహిళల మృతి..

- Advertisement -
- Advertisement -

కాబుల్: దేశాన్ని విడిచేందుకు వీసాల కోసం నంగర్హర్ ప్రావిన్సులోని సాకర్ స్టేడియంలో వేచి ఉన్న వేలాది మంది ఆఫ్ఘన్ పౌరుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది మహిళలు మరణించారు. బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారని, వారిలో మహిళలే అధికంగా ఉన్నారని గవర్నర్ అత్తౌల్లా ఖోగ్యాని తెలిపారు. మృతులలో వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా ఉండగా.. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని తఖర్ ప్రావిన్సులో తాలిబన్ తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో 34 మంది ఆఫ్ఘన్ పోలీసులు మరణించినట్లు స్థానిక ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో మరో 8 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వీరంతా కాన్వాయ్‌లో వెళుతుండగా వారిపై తాలిబన్ తీవ్రవాదులు మెరుపుదాడి చేశారని ఆయన చెప్పారు.

11 Afghanistan Woman died in Stampede at Pak Consulate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News