Friday, March 29, 2024

పిఎల్‌ఎకు చైనా సైనికుడిని అప్పగించిన భారత సైన్యం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: తూర్పు లడఖ్‌లో అదుపులోకి తీసుకున్న చైనా సైనికుడిని భారత సైన్యం బుధవారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ)కి అప్పగించినట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో గత ఆదివారం వాస్తవాధీన రేఖను దాటిన చైనా సైనికుడిని భారత సైన్యం అదుపులోకి తీసుకుందని, స్థానిక పశువుల కాపరులకు సాయం చేసే ప్రయత్నంలో దారి తప్పి ఎల్‌ఎసిని దాటిన చైనా సైనికుడిని బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం విడిచిపెట్టిందని చైనా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాకు చెందిన పిఎల్‌ఎలో సైనికుడిగా పనిచేస్తున్న వాంగ్ యా లాంగ్‌ను చుషుల్-మాల్డో సరిహద్దు పాయింట్ వద్ద చైనా సైన్యానికి అప్పగిస్తామని భారత సైన్యం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

India hands over to Chinese Soldier who crossed border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News