Thursday, April 25, 2024

ధరణి నిరంతర ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

TS high court

మనతెలంగాణ/ హైదరాబాద్: ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాలశర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈక్రమంలో ధరణిలో ఆస్తుల నమోదుకు ఎలాంటి గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆస్తుల నమోదుకు చివరి తేదీ లేదన్న ఎజి వివరణను నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. చట్టబద్దత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారని కోర్టుకు విన్నవించారు. వెబ్‌సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని ఈ క్రమంలో 15 రోజుల్లోనే వివరాలు నమోదు చేయాలంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటి అని ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని చెప్పాలని హైకోర్టు ఎజికి సూచించింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై విచారణను సైతం నవంబర్ 5కి వాయిదా వేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court Hearing on Assets Enrolling in Dharani 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News