సిఎం సీటుకు ఎసరు పెడుతారేమోనని రేవంత్‌కు భయం
ఫోన్ ట్యాపింగ్ నిజమా?.. కాదా?.. లైడిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా?
ఎపి మంత్రి లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి?.. ఆయన ఏమైన అంతర్రాష్ట్ర దొంగనా?
తెలంగాణ ప్రయోజనాలను బాబుకు తాకట్టుపెట్టిన రేవంత్
బనకచర్లపై మరో ఉద్యమానికి సిద్ధం
డ్రగ్స్‌పై దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: సిఎం రేవంత్ రెడ్డి తన సీటుకు ఎసరు పెడతారోననే భయంతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చే యిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శక్రవారం ఆయన పర్యటించి ఇటీవల మృతి చెందిన మాజీ ఎంఎల్‌ఎ మదన్ లాల్ కుటుంబ సభ్యులను, మాజీ ఎంఎల్ ఎ రేగా కాంతారావు మాతృమూర్తి మరణం తో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈసందర్బంగా ఖమ్మం బి తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థ్దాయిలో ధ్వజమెత్తారు.ముగ్గురు మంత్రుల ఫోన్లే కాదు..ఇంకా అనేకమంది ఫోన్లను ట్యాపిం గ్ చేస్తున్నారని అన్నారు. ఒకపక్క బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వి చారణ చేయిస్తూనే ఎక్కడ తన సీటుకు ముప్పు వస్తుందనే భయంతో మంత్రుల ఫో న్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని వ్యా ఖ్యానించారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చే యించడం నిజం కాదా? దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానని అన్నారు.తనపై 20 నెలల్లో ట న్నుల కొద్దీ కేసులు పెట్టించారని, కానీ గుం డు పిన్నంత ఆధారం కూడా దొరకలేదన్నా రు. తప్పుచేస్తే ఆధారం దొరు కుందని, తా ము ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు అని అడిగిన మొట్టమొ దటి రాజకీయ నాయకున్ని తానేనని అన్నారు. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని, ఇప్ప టికైనా ఎక్కడికి రావాలో చెబితే అక్కడికి తప్పకుండా వస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీకి కూడా వస్తామని కానీ మైకులు కట్ చేయకుండా చూసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎనుముల కుటుంబసభ్యులు మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి సరైన చికిత్స చేయించాలని సూచించారు. చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిలా తాను దొంగను కాదన్నారు. దొంగతనం చేయడం, దొరికిపోవడం రేవంత్ రెడ్డి నైజమన్నారు.
లోకేశ్ బాబును కలిస్తే తప్పేంటి?..
ఏపికి చెందిన మంత్రి నారా లోకేశ్‌ను తాను అర్ధరాత్రి కలిసినట్లు సిఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఇప్పటివరకు లోకేశ్‌ను కలవ లేదని, కలిస్తే తప్పు ఏమిటని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు. అతనితో డెఫినెట్‌గా సత్సంబంధాలు ఉన్నాయని, తాము ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటామని అన్నారు. ‘కానీ కలవలేదని, కలిస్తే తప్పింది? అయినా ఆయన మీ పెద్దబాస్ చంద్రబాబు కొడుకే కదా…? నేనోదో గూండాను.. దావూద్ ఇబ్రహీమ్‌ను చీకట్లో కలిసినట్లు డైలాగులు ఏంది నేను ఏమైనా నీలాగా దొంగను కలిశానా? నీలాగా నేను లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా; ఢిల్లీలో చీకట్లో పోయి అమిత్ షా కాళ్లు పట్టుకుని, మోడీ పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా…? పక్క రాష్ట్రం మంత్రి, యువకుడు నాకు తమ్ముడి లాంటోడు కలిస్తే కలుస్తా. కానీ కలవలేదు. దానికేదో ఆయన గొప్ప విషయం కనిపెట్టినట్లు, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే బిఆర్‌ఎసోళ్లను కలుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది. నీకేం బాధ అయితుంది. ఈ చిల్లర మాటలతోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్తావ్. ఎన్నిరోజులు ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తప్’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ కలవాల్సి వస్తే బాజాప్తా కలుస్తా.. బేజాప్తా చేయాల్సిన కర్మ తమకు లేదన్నారు.
నేను ఏనాడూ సిగరెట్ కాల్చలేదు…
దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకేం సంబంధం అని కెటిఆర్ ప్రశ్నించారు. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలని భావించే తాను జీవితంలో ఏనాడూ కూడా సిగరెట్ తాగలేదని అన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి తనకు డ్రగ్స్ ఆలవాట్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన విషయంలో ఓసారి డ్రగ్స్ అంటారు… ఓసారి కార్ రేసింగ్ ఫార్ములా అంటారు.. మరోసారి కాళేళ్వరం అంటాడని ఆయన మండిపడ్డారు. . డ్రగ్స్ ఆరోపణలపై రేవంత్ దమ్ముంటే బహిరంగంగా మీడియా ముందు ఆరోపణలు చేయాలని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లైడిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి వల్ల యూట్యూబర్లకు, థంబ్ నెయిల్స్‌కు మినహా ఎవరికీ లాభం లేదని ఎద్దేవా చేశారు.
ఎక్కడ ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాల గురించి ప్రజలు నిలదీస్తారేమోఅని ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప..రేపంత్ రెడ్డి గడిచిన 20 నెలల్లో చేసింది శూన్యమని విరుచుకపడ్డారు .. గాసిప్ మాయలో పడి, ఆరు గ్యారంటీలను మర్చిపోదామా? అని ప్రశ్నించారు.ఫోర్త్ సీటి,త్రీబుల్ ఆర్ పేరుతో జరిగే భూదందాపై త్వరలో సర్వే నెంబర్లతో సహా బయటపెడతానని అన్నారు. బనకచర్ల పేరిట చంద్రబాబుకు రేవంత్ చెల్లిస్తున్న గురుదక్షిణను తాము అడ్డుకుంటామని, అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంఎల్‌ఎలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వర్ రావు, తాటి వెంకటేశ్వర్లు జడ్‌పి మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, బిఆర్‌ఎస్ నాయకులు గుండాల కృష్ణ (ఆర్‌జెసి),ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు