Sunday, July 20, 2025

కివీస్‌కు రెండో గెలుపు

- Advertisement -
- Advertisement -

హరారే: ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఆతిథ్య జట్టు జింబాబ్వేతో జరిగిన పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో కివీస్‌(Kiwis) కు ఇది వరుసగా రెండో గెలుపు కాగా, జింబాబ్వే రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ మధెవర్ (36), బ్రియాన్ బెన్నెట్ (21)లు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు.

జాకబ్ డఫి, కెప్టెన్ సాంట్నర్, రచిన్ రవీంద్రలు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 13.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డెవోన్ కాన్వే (Opener Devon Conway) అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కాన్వే 40 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర 19 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇక డారిల్ మిఛెల్ 26 (నాటౌట్) జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు. కివీస్ ఇంతకుముందు సౌతాఫ్రికాను కూడా ఓడించింది. ఇక జింబాబ్వే తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News