- Advertisement -
మలయాళం సూపర్‌స్టార్ మోహల్లాల్కు(Mohanlal) దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. మలయాళం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు, తమిళ, కన్నడ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తారు. ఆరు పదుల వయస్సులో కూడా ఆయన యాక్షన్ సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. మోహన్‌లాల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పేరు ‘వృషభ’. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మోహన్‌లాల్.. రాజు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. భారీ విఎఫ్ఎక్స్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఇక ఈ సినిమాకి నందకిషోర్ దర్శకత్వం వహించారు. దీపావళీ కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Also Read : ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా
- Advertisement -