మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండుసార్లు పార్టీ తరఫున గెలిచానని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు చాలా అభిమానమని, మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబమని ఆయన చెప్పుకొచ్చారు.
అలాంటి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్లు, పార్టీ మారుతున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ నమ్మవద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, కొత్త పార్టీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్లు సోషల్‌మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు.
Also Read: మోహన్‌లాల్ ‘వృషభ’ టీజర్ వచ్చేసింది.. యాక్షన్ కేక