Home Default చెక్కుల డ్రాతో కిటకిటలాడుతున్న బ్యాంక్

చెక్కుల డ్రాతో కిటకిటలాడుతున్న బ్యాంక్

Bank-image

సౌకర్యాలు కల్పించాం:బ్యాంక్ మేనేజర్ జానకి

మనతెలంగాణ/సుల్తానాబాద్: రైతు బంధు పథకం కింద పాస్‌బుక్కులు, చెక్కుల పంపిణీతో సుల్తానాబాద్ అంధ్రా బ్యాంక్‌లో రైతులు చెక్కులను డ్రా చేసుకోనేందుకు బారులుతీరారు.మండుటెండలను కూడా లెక్క చేయకుండా రైతులు వారివారి చెక్కులతో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్‌కు చేరుకున్నారు.సుల్తానాబాద్ మండలం రైతు బంధు పథకం చెక్కుల పంపిణీకి ఒక్క ఆంధ్రా బ్యాంక్‌కు మాత్రమే కేటాయించటంతో ఈ బ్యాంక్‌లో రైతుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ జానకితో మనతెలంగాణ కలిసి రైతుల చెక్కుల డ్రా ఏవిధంగా జరుగుతున్నదనివివరణ కోరగా సుల్తానాబాద్ మండలంలో 12 వేల 707చెక్కులు ఉన్నాయని అన్నారు. ఇందుకు గాను 9కోట్ల 95లక్షల 43వేల 630 రూపాయలు రైతులకు డ బ్బులను ప్రభుత్వ ఆదేశాల మెరకు అందించటం జరుగుతున్నాదని మేనేజర్ తెలిపారు. రైతులకు ఏలాంటి ఇ బ్బ ందులు జరగకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చే శామని తెలిపారు.ఉదయం 10గంటల నుంచి సాయంత్రం  4గంటల వరకు బ్యాంక్ అన్ని పని దినాల్లో చెక్కులను డ్రా చేసి రైతులకు డబ్బులను అందించటం జరుగుతుందని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ జానకి మన తెలంగాణతో తె లిపారు. మండలంలోని 23గ్రామాల రైతులు చె క్కులతో ఆంధ్రా బ్యాంక్‌కు చేరుకోని డబ్బులను డ్రా చేసుకోనేందుకు చెరుకుంటున్నారు.ఈ చెక్కులను మూడు నెలల లోపు డ్రా చేసుకోనే అవకాశం రైతులకు ఉన్నప్పటికి వెను వేంటనే బ్యాంక్‌కు చేరుకోవటంతో వందలాది మందితో బ్యాంక్‌లో రద్దీ పెరిగింది.