Friday, March 31, 2023

నీటి గుంతలో పడి బాలుడి మృతి

- Advertisement -

boy
మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్‌ః జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు వద్ద గల గుంతలో పడి తొమ్మిదేళ్ల కార్తీక్ మృతి చెందాడు. వివరాల్లోకి వేళితే ఆదివారం అంబేద్కర్ నగర్ కు చెందిన శంకర్ కుమారుడు కార్తీక్ ఆదివారం ఖానాపూర్ చెరువు వద్ద ఉన్న గుంతలో ఈత కోసం దిగాడు. గుంతలో దిగిన కార్తీక్ ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో కార్తీక్‌తో వచ్చిన సాయి వెంటనే ఇంటికి వెళ్లి గుంతలో పడిపోయడని సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ అక్కడికి చేరుకొని కాలనీవాసుల సహాయంతో బాలుడి మృతదేహన్ని బయటకు తీశారు. సంఘటన స్థలానికి సీఐ సురేష్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రిమ్స్‌లోని మర్చురిలో మంత్రి రామన్న మృతదేహన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిని ట్యాంక్ బండ్ పనులు గత ఆరు నెలలుగా కొనసాగకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు. గుంతలు తవ్వి వాటికి రక్షణ కవచాలు కూడా ఏర్పాటు చేయలేదని సదరు కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు. మంత్రి వెంటనే టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News