Home అంతర్జాతీయ వార్తలు జింకను చంపబోయి.. తండ్రిని పొట్టనబెట్టుకున్నాడు!

జింకను చంపబోయి.. తండ్రిని పొట్టనబెట్టుకున్నాడు!

Huntingన్యూయార్క్ : అటవీ ప్రాంతంలో ఓ యువకుడి అత్యుత్సాహం అతడి తండ్రి ప్రాణాలు బలిగొన్నది. ఓ జింకను చంపబోయిన యువకుడు అతడి తండ్రినే పొట్టనబెట్టుకున్నాడు. న్యూయార్క్‌కి చెందిన క్రిస్టఫర్ అనే యువకుడు తను ఇంటి వెనుక ఉన్న అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ జింకను చంపేందుకు క్రిస్టఫర్ చెట్టెక్కి తుపాకీతో కాల్చాలనుకున్నాడు. జింక ఉన్న ప్రాంతంలోనే అతని తండ్రి కెవిన్ కూడా వేటకు వెళ్లాడు. జింక తిరుగుతున్న చోట చప్పుడు వినిపించడంతో క్రిస్టఫర్ అక్కడ తుపాకీతో కాల్చేశాడు. తీరా వెళ్లి చూసేసరికి తండ్రి నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో కెవిన్‌ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా బుల్లెట్ ఛాతిలో తగలడంతో అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. న్యూయార్క్ పోలీస్, అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.