Wednesday, April 24, 2024

పోలవరం ముంపుపై వివరణ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటీ లేఖ
బ్యాక్ వాటర్‌పై సమగ్ర అధ్యయనం జరిపించాలన్న
తెలంగాణ లేఖకు స్పందన 36లక్షల క్యూసెక్కుల
వరదకే భద్రాచలం మునిగిందని ప్రస్తావన

మన: గోదావరి నదిపై పోలవరం వద్ద ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజె క్టు ప్రభావం వల్ల ఏర్పడ నున్న ముంపు సమస్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ రాసిన లేఖపై పోలవరం ప్రాజెక్టు అ థారిటీ (పిపిఏ) స్పందించింది. లేఖలోని అంశాలపై ఏపి ప్రభుత్వాన్ని వి వరణ కోరింది. లేఖ ప్రతిని పిపిఏ సీఈవో ఏపి ప్రభుత్వానికి పంపారు. లేఖలోని అన్ని అంశాలను పరిశీలించి వివరణ ఇవ్వాలని కోరారు. పోలవరం బ్యాక్ వాటర్ విస్తరించే ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పాజెక్టు అథారిటీని కోరింది. ఇదే అంశాన్ని కేంద్ర జలసంఘం దృష్టికి కూడా తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ పోలవరం అథారిటీ సీఈవోకు రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎగువన ఉన్న తెలంగాణ , చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతం ఎంత అన్నది తేల్చేందుకు స్వంతత్ర సంస్థను నియమించి ఆ సంస్థ ద్వారా సమగ్రంగా అధ్యయనం జరిపించాలని కోరింది. జులైలో కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వచ్చిన వరద ప్రవాహాన్ని ప్రస్తావించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే ఇటీవలి భారీ వరదలకు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం పట్టణం వరద ముంపునకు గురైనట్టు తెలిపింది.అంతే కాకుండా నదికి ఇరువైపులావున్న 60గ్రామాలపైన వదర ముంపు ప్రభావం పడినట్టు తెలిపింది. భద్రాచలం పట్టణానికి 26కిలోమీటర్ల ఎగువన ఉన్న దుమ్ముగూడెం వరకు నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు 5రోజుల పాటు వరద నీటిలో మునిగి ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని తెలిపింది. 1986నాటి భారీ వరదల ప్రభావాన్ని గుర్తు చేసింది. గోదావరిలో 36లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వల్లనే భద్రాచలం పరిసర ప్రాంతాలు నీటిముంపునకు గురైనట్టు తెలిపింది. అప్పటి వరదల తర్వాత ఈ ఏడాది జులై 16న గోదావరికి అతిపెద్ద వరద వచ్చిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వల్ల రిజర్వాయర్‌కు ఎగువన బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత మేరకు విస్తరిస్తుందన్న అంశాలపై ఖచ్చితమైనా సాంకేతిక అధ్యయనం జరపాలని కోరింది. 2022నవరంబర్ 2న జరిగిన పోలవరం ఆథారిటీ 13వ సమావేశంలో ఇదే అంశాలను కోరామని తెలిపింది.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం పోలవరం బ్యాక్ వాటర్‌పై వెలిబుచ్చిన సందేహాలు, అభిప్రాయాలు కూడా ఆ నాటి సమావేశంలో రికార్డు అయినట్టు గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఏదైనా నష్టం జరిగితే అందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ , ఏపి ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎగువ ప్రాంతాలకు ఎటు వంటి ముంపు నష్టాలు జరగకుండా తగిన ముందు జాగ్రత్తలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఎగువన భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్నతెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరింది. ఇందుకోసం సమావేశం నిర్వహించి అన్ని సమస్యలు చర్చించాలని కోరింది. కిన్నెరసాని, ముర్రేడు వాగు ఆనకట్ట అంశాలు కూడా ప్రస్తావించింది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక ఫుల్ రిజర్వాయర్ లెవల్ 150అడుగులకు చేరుతుందని తెలిపింది. ప్రాజెక్టు వెనుకజలాల వల్ల ఏర్పడే ముంపు సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయించి వాటిని భాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి , పూర్చి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పిపిఏపైనే ఉందని తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 36లక్షల క్యూసెక్కలు స్థాయికి మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలిపింది. డిశార్జి సామర్థం 50లక్షల క్యూసెక్కులకు పెంచితే కొత్తగా పర్యావరణ పరమైన అనుమతులు తీసుకోవాలని , అంతే కాకుండా భాగస్వామ్య రాష్ట్రాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ సిఈవోకు లేఖ రాశారు. లేఖ ప్రతిని కేంద్ర జలసంఘం చైర్మన్‌కు పంపారు. ఈ లేఖపై పోలవరం ఆథారిటీ సత్వరమే స్పందించి లేఖ ప్రతిని ఏపి ఈఎన్సీకి పంపింది. లేఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై అభిప్రాయాలు తెలపాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News