Home జాతీయ వార్తలు నాలుగేళ్ల బాలుడిపై టీనేజీ కుర్రాడు అత్యాచారం..!

నాలుగేళ్ల బాలుడిపై టీనేజీ కుర్రాడు అత్యాచారం..!

teenage-raped-on-4-year-boyగుర్గావ్ : హర్యానాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై ఓ టీనేజీ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుర్గావ్‌లో నివసించే నాలుగేళ్ల బాలుడిపై పదిహేనేళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో వుండే యువకుడు ఒంటరిగా వున్న బాలున్ని ప్రలోభపెటిట ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచారానికి గురైన బాలుడి సోదరుడితో నిందితుడు చనువుగా వుండేవాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం బయటకు రావడంతో నిందితుడు పరారయ్యాడు. అతనిపై లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.