Home జాతీయ వార్తలు ఆడపిల్లకు జన్మనిచ్చిన బాలిక

ఆడపిల్లకు జన్మనిచ్చిన బాలిక

rapevictim

చండీగఢ్ : పదేళ్ల బాలిక గురువారం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ బాలిక అత్యాచార బాధితురాలు. వరుసకు మామ అయ్యే వ్యక్తి ఆ బాలికపై కొన్ని నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి వచ్చింది. ఆమెను తల్లిదండ్రులు చికిత్స కోసం ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలిక గర్భవతి అని అక్కడి వైద్యులు నిర్ధారించారు. తమ కూతురు గర్భాన్ని తొలగించేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో బాధిత బాలిక తల్లిదండ్రులు పిటిషన్ కూడా వేశారు. అయితే అబార్షన్ వల్ల ఆ బాలికకు ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ బాలికకు అబార్షన్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ ఆడపిల్ల బరువు 2.2 కిలోలు ఉందని, ప్రస్తుతం ఆ బాలిక, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధిత బాలికకు మాత్రం తాను తల్లి అయిన విషయం తెలియదు. కడుపులో రాయి ఉంటే తొలగించేందుకు ఆపరేషన్ చేశారని ఆమె తల్లిదండ్రులు ఆ బాలికకు చెప్పారు. ఈ బాలికకు జన్మించిన ఆడపిల్లను ఎవరికైనా దత్తత ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులు వైద్యులను కోరారు.

A girl gave birth to a female kid