Saturday, April 20, 2024

సూర్యపేటలో దారుణం: ప్రేమించడంలేదని యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

A Girl set on fire by spurned lover in Suryapet Dist

సూర్యపేట: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను ఒప్పుకోవడంలేదని యువతిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన జిల్లాలోని తిరుమల గిరిలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ అనే వ్యక్తి తన ప్రేమను ఆంగీకరించాలని గత రెండు సంవత్సరాలుగా వెంటబడుతూ బాధితురాలిని వేధిస్తున్నాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు అతని ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో ఉన్మాదిగా మారిన నిందితుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలి కేకలు విన్న చుట్టు ప్రక్కలవారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామని పోలీసులు తెలిపారు.

A Girl set on fire by spurned lover in Suryapet Dist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News