Home తాజా వార్తలు భూ వివాదం.. వ్యక్తి దారుణ హత్య

భూ వివాదం.. వ్యక్తి దారుణ హత్య

 

నిజమాబాద్: జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. భూ తగాదాలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలో భీమ్ గల్ మండలోని బాబాపుర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బలరామ్, కలీమ్ ల మధ్య గత 20 సంవత్సరాలుగా భూమి విషయంలో గొడవ జరుగుతోంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు కోర్టులో కేసు కూడా వేసుకున్నారు. అయితే, బలరామ్ ప్లాన్ చేసి.. భూ వివాదాన్ని సెటిల్ మెంట్ చేసుకుందామని కలీమ్ ని రమ్మని చెప్పి అతనిపై దాడి చేశాడు. కలీమ్ రాగానే కళ్లలో కారం పొడి కొట్టి, దారుణంగా హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు బలరామ్ ని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకున్నారు. ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

A Man killed over land dispute in Nizamabad