Home ఖమ్మం అమ్మ ప్రేమంటే ఇదే…

అమ్మ ప్రేమంటే ఇదే…

Frog-love

తల్లికి బిడ్డ ఎన్నటికీ భారం కాదు
ఖమ్మం: ఈ చిత్రం చూశారుగా…ఓ కప్ప తనకు పుట్టిన బిడ్డను తన వీపుపై ఎక్కించుకొని నేటి సమాజానికి అద్దం పట్టే ఓ అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. కొందరు తల్లిదండ్రులు ఆడశిశువు పుట్టగానే ఏచెత్తబుట్టలోనో, రోడ్డపైనో పారవేయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కానీ ఇవేమి తనకు అక్కర్లేదంటూ తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోవాలని భావించిన ఓ కప్ప రాత్రి వేళల్లో శత్రువుల నుంచి కాపాడుకునేందుకు తన వీపుపై ఎక్కించుకొని రక్షణ కల్పిస్తున్న దృశ్యం మన తెలంగాణ తన కెమెరాలో బంధించింది. నేట సమాజంలో బిడ్డలకు తల్లిదండ్రులు భారమై వారి బాగోగులను పట్టించుకోకుండా వదిలివేస్తున్నప్పటికీ తమ బిడ్డ తమకు భారం కాదంటూ ఎటువంటి తారతమ్యం చూపించకుండా జీవరాశి అయిన కప్ప తనబిడ్డను అక్కున చేర్చుకోవడం పలు అర్థాలకు తావిస్తుంది.