Tuesday, March 5, 2024

భ‌ర్త‌, పిల్ల‌కు విషమిచ్చి.. మ‌హిళా డాక్ట‌ర్‌ ఆత్మ‌హ‌త్య

- Advertisement -
- Advertisement -

A Nagpur based doctor allegedly died by suicide

మహారాష్ట్ర:  జీవితం మీద విర‌క్తి చెందిన ఓ మహిళ డాక్టర్ తన భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌కు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మంగ‌ళ‌‌వారం రాత్రి చోటుచేసుంది.  పోలీసుల కథనం ప్రకారం… 41 ఏళ్ల డాక్ట‌ర్ సుష్మా రాణే త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు, అత్త‌‌తో క‌లిసి నాగ్‌పూర్‌లోని ఓమ్‌న‌గ‌ర్‌లో నివాసముంటోంది. ఆమె భ‌ర్త ధీర‌జ్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. డాక్ట‌ర్ త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌కు రాత్రి భోజనంలో మత్తు మందు క‌లిపి పెట్టింది. అది తిన్నవారు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు.

అనంతరం వాళ్లకు గుర్తుతెలియ‌ని ఇంజెక్ష‌న్లు ఇవ్వడంతో వారు మృతి చెందారు. తర్వాత ఆమె గదిలో ఉరివేసుకుందని కొరాడీ పోలీసులు తెలిపారు. వెల్ల‌డించారు. బుధవారం తెల్ల‌వారైన ఎవరు బయటకు రాక‌పోవ‌డంతో వైద్యురాలి అత్త‌మ్మ‌ డోర్ కొట్టింది. అయినా త‌లుపు తెరవకపోవడంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌‌తోపాటు రెండు సిరంజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌‌లో జీవితంపై అంసంతృప్తితో ఇంత‌పెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రాసిఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు వెల్లడించారు.

A Nagpur based doctor allegedly died by suicide

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News