Thursday, April 25, 2024

మెడికల్ సీట్ల ‘దందాకు చెక్’!

- Advertisement -
- Advertisement -

సీట్ల బ్లాకింగ్ నిరోధానికి
కొత్త విధానం ఖరారు
మొదటి, రెండు విడతల్లో
సీట్లు పొందిన వారికి
తదుపరి కౌన్సెలింగ్‌లో
నో ఛాన్స్ వైద్య కళాశాల
యాజమాన్యాల అక్రమాలను
అరికట్టడడమే లక్షం
ఈ ఏడాది నుంచే నూతన
విధానం అమలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మెడికల్ యుజి, పిజి ప్రవేశాలల్లో సీట్ల బ్లాకింగ్ నిరోధనానికి నూతన విధానం అమలులోకి రానుంది. ఎంబిబిఎస్ లేదా పిజిలో ఆలిండియా కోటా, రా ష్ట్ర స్థాయిలో జరిగే కౌన్సెలింగ్ ద్వారా రెండో విడతలో సీట్లు పొం ది, కళాశాలల్లో ప్రవేశం పొంది న వారికి … ఆ తరువాత జరిగే కౌన్సెలింగ్‌లో పా ల్గొనేందుకు అనుమతి ఇవ్వరు. ఈ మేరకు చర్య లు తీసుకోవాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది నూతన రా ష్ట్రంలో ఈ నూతన విధానం అమలులోకి రానుం ది. ఈ విధానం అమల్లోనికి తెచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నా రు. సీట్ల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. ఇదివరకు మొదటి రెండు రౌండ్లలోసీటు వచ్చిన విద్యార్థులు మళ్లీ, మళ్లీ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. దీంతో ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన మెరిట్ విద్యార్థులు, మన రాష్ట్రంలోని కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా మెడికల్ కాలేజీలు ఒప్పందం చేసుకునేవి. ఆలిండియా కోటాలో, రాష్ట్ర స్థాయిలో జరిగే కౌన్సెలింగ్ ద్వారా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులచే దరఖాస్తు చేయించి పలు ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు సీట్లు బ్లాకింగ్ చేయించుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

అప్పటికే సీటు లభించిన అభ్యర్థులు మెరుగైన ర్యాంకర్లు అయినందున మెరిట్ ఆధారంగా సీట్లు దక్కుతున్నాయి. వీరికి మొదటి రెండు విడతల్లోనే సీట్లు వచ్చినందున కొత్తగా సీట్లు వచ్చినా కళాశాలల్లో చేరరు. దీనివల్ల ఈ సీట్లు ఖాళీగా ఉంటాయి. వీటిని మిగులుగా చూపించి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటున్నాయి. ఒక్కో సీటు భర్తీకి విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నూతన విధానంతో వివాదాలు లేకుండా పారదర్శకంగా కౌన్సెలింగ్ జరగనుంది. ఈ నూతన విధానం ద్వారా ప్రైవేట్ కాలేజీల దందాకు చెక్ పెడటంతో పాటు ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం భర్తీ కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News