Friday, March 29, 2024

కలుషిత నీరు సరఫరా కాకుండా కొత్త పైపులైన్ వేయాలి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని మెట్టుగూడ చింతబావి బస్తీలో కలుషిత తాగునీరు సరఫరా అయిందనే ప్రచారంతో జలమండలి ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్1 అజ్మీరా కృష్ణ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆ ప్రాంతాన్ని గురువారం సందర్శించారు.
ఈనెల 25వ తేదీన స్థానిక లైన్ మెన్ లు తాగునీరు విడుదల చేసిన మొదటి 5- నుంచి 10 నిమిషాల వరకు 15 నుంచి – 20 గృహాల వినియోగదారులకు కలుషిత నీరు సరఫరా అయినట్లు గుర్తించి అధికారులకు విన్నవించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సరఫరాను నిలిపివేసి ఆ వినియోగదారులకు నీరు తాగునీటిని ఉపయోగించవద్దని సూచించారు. వారికి తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేశారు. అదే సమయంలో నీరు ఎక్కడ కలుషితం అయిందనే విషయం తెలుసుకోవడానికి పొల్యూషన్ చెకింగ్ యంత్రంతో పైపు లైనును పరీక్షించారు. ఈ పరీక్షల ఫలితాల ప్రకారం.. అక్కడున్న సీవరేజీ మ్యాన్ హోల్ కు దగ్గరలో ఉండే ఒక గృహ కనెక్షన్ నుంచి మంచినీటి పైపు లైనులోకి మురుగు నీరు కలిసినట్లు నిర్ధారణ అయింది.

Also Read: దళితబంధు డబ్బులు తిన్న ఎంఎల్ఎలు వాపస్ ఇవ్వాలి: ఈటల

రెండోసారి సరఫరా గురువారం మొదటి కొన్ని నిమిషాల వరకు కలుషిత నీరు సరఫరా అయింది. అయితే దీనికి కారణం అప్పటికే అందులో నిలిచి ఉన్న మురుగు నీరు మళ్లీ కలవడమే. దీంతో సంబంధిత సీజీఎం, క్వాలిటీ సెల్ జీఎంలు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. అందులో క్లోరిన్ శాతం 0.2 పీపీఎంగా తేలింది. అంతేకాకుండా వారు ఆ ప్రాంత బస్తీ దవాఖానా వైద్యుల్ని సంప్రదించి బాధితుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. జలమండలి ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అందులో కొంతమంది డయేరియా, జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ వారి ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిగిలిన వారు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు జలమండలి అధికారులతో మాట్లాడారు. వెంటనే పాత సీవరేజి పైపు లైనును తొలగించి దాని స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు ఆ ప్రాంత వాసులకు ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News