Saturday, April 20, 2024

సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం

- Advertisement -
- Advertisement -

corona cases

 

తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం
n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర చికిత్స, ఐసొలేషన్, అవగాహన కార్యక్రమాలకు ప్రణాళిక
n కోవిడ్-19 విస్తరణ హెచ్1ఎన్1 తరహాలో ఉందని నిర్ధారణ

న్యూఢిల్లీ: సముదాయపు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక నిరోధక వ్యూహాన్ని రూ పొందించింది. దీని మేరకు ఆయా ప్రాంతాలలో క్వారంటైన్, భౌతిక దూరం వంటి చర్యలు, సరైన పర్యవేక్షణ, అనుమానిత కేసుల పరీక్షలు, ఐసోలేషన్, కరో నా సోకిన వారి సమీప వ్యక్తుల క్వారంటైన్, ఆయా ప్రా ంతాలలో ప్రజలలో కల్పించాల్సిన అవగావహన కార్యక్రమాలు వంటివి చేపడుతారు. కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, క ర్నాటక వంటి రాష్ట్రాలలో వివిధ కారణాలతో కరోనా వ్యాప్తి చెందింది. సమూహాలుగా తిరగడంతో ఈ పరిణా మం చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. ఆయా రాష్ట్రాలలో వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రాంతాలను ఎంచుకుని అక్కడ త్వరితగతిన కేసులను గుర్తిస్తారు. ఇప్పుడు రూపొందించిన వ్యూహం మేరకు వారికి వెం టనే సరైన చికిత్సలు అందిస్తారు. తద్వారా అక్కడ వైర స్ నియంత్రణతో పాటు కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తారు.

ఒకచోట వ్యాపించే వైరస్‌తో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యాధి సంక్రమిస్తోంది. దీని నివారణకు తగు విధంగా ఇప్పుడు క్లస్టర్ కంటైన్‌మెంట్ స్ట్రాటజీని రూపొందించారు. ప్రయాణాలు చేసే వారు కరోనా లక్షణాలతో ఉంటే వారు వెళ్లే చోట ఇతరులకు కరోనా వ్యాపింపచేస్తున్నారని, అదే విధంగా గుంపులుగా వెళ్లే క్రమంలో కూడా కరోనా నియంత్రణ అసాధ్యం అవుతోందని గుర్తించారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు నిరోధక వ్యూహాన్ని రూపొందించారు. దేశంలో ఇప్పుడు 211 జిల్లాలలో కోవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. వీటి ప్రాతిపదికన వైరస్ మరింతగా వ్యాపించే ముప్పు ఉంది. దేశంలో ప్రయాణ సంబంధిత కేసులు, స్థానికంగా కోవిడ్ 19 వ్యాప్తి, నియంత్రణ పరిధిలో ఉన్న విస్తృత వ్యాప్తి వంటి పరిణామాలతో దేశంలో కరోనా అంటువ్యాధి స్థాయికి చేరింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాలను భౌగోళికంగా క్వారంటైన్ చేయడం ద్వారా దీనిని కట్టడి చేయవచ్చునని నిర్ణయించారు. వైరస్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల చుట్టూ అడ్డంకులను కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలోకి రాకపోకలను నివారిస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో కోవిడ్ 19 విస్తరణ క్రమం ఇంతకు ముందటి హెచ్1ఎన్1 అంటువ్యాధి ఇంఫ్లూయెంజా తరహాలో ఉందని నిర్థారించారు. దేశ జనాభా దృష్టిలో పెట్టుకుని చూస్తే కోవిడ్ 19 వ్యాప్తి సగటున చూస్తే తీవ్రంగానే ఉంది. అయితే ఇది దేశంలోని అన్ని చోట్లా ఒకేలా లేదని కనుగొన్నారు. దీనితో ఆయా ప్రాంతాలకు అనుగుణంగానే కరోనా కట్టడికి తగు వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుందని గుర్తించి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పుడు వ్యూహ పత్రాన్ని రూపొందించింది.

 

A New Strategy on Collective Cases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News