Home తాజా వార్తలు నిమ్స్‌లో నర్సు ఆత్మహత్యాయత్నం

నిమ్స్‌లో నర్సు ఆత్మహత్యాయత్నం

Nurse
నిలకడగా ఉన్న నర్సు నిర్మల ఆరోగ్యం

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా నర్సు నిర్మల చాలాకాలంగా పదోన్నతి కల్పించడం లేదంటూ నిరాశ చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్దానిక పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని గోల్కొండ ప్రాంతంలో నివసించే నిర్మలాదేవి గత 25 సంవత్సరాలుగా నిమ్స్ ఆసుపత్రి స్టాప్‌నర్స్‌గా పనిచేస్తుంది. సర్వీసు రికార్డు ప్రకారం ఆమెకు అసిస్టింట్ మేనేజర్‌గా పదోన్నతి కల్పించాల్సి ఉండగా నిమ్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వస్తుందన్న ఆశతో ఉండగా ఇప్పటికి నిమ్స్ అధికారులు నిర్లక్షం చేయడంతో తీవ్ర మనస్దాపానికి గురై గురువారం మధ్యాహ్నం సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బ్లెడ్‌తో మెడ,చేతులు కోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది.

గమనించిన సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించారు. తీవ్ర రక్తస్రావం అయినా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో నిర్మల భర్త మారయ్య ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మలా ఆత్మహత్యయత్నానికి అధికారుల నిర్లక్షమే కారణమని డైరెక్టర్ కార్యాలయం వద్ద స్టాప్ నర్సులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా ఆంద్ర ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నారని ఆరోపించారు.

A Nurse Attempts Suicide At NIMS Hospital