Home తాజా వార్తలు పేట్‌బషీరాబాద్‌లో కాల్పుల కలకలం

పేట్‌బషీరాబాద్‌లో కాల్పుల కలకలం

GUNహైదరాబాద్: పేట్‌బషీరాబాద్‌లోని బాపూనగర్‌లో కల్పులు కలకలం చోటుచేసుకుంది. నరేందర్‌రెడ్డి అనే వ్యక్తిపై సాయిప్రభు అనే యువకుడు తన వద్ద వున్న గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సాయిప్రభును అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనపరచుకున్నారు.
గాయపడిన నరేందర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.