Home తాజా వార్తలు హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్… పోలీసుకు జరిమానా

హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్… పోలీసుకు జరిమానా

 

సాదారణ జనాలు బైక్ నడుపుతున్న సమయంలో పొరపాటున హెల్మెంట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్ చేసిన గానీ.. ట్రాఫిక్ పోలీసులు వారికి చుక్కలు చూపిస్తారు. అయితే, ఇలాంటివన్నీ సాదారణ ప్రజలకే వర్తిస్తుందని అనుకున్నారేమో గానీ, ఓ పోలీసు హెల్మెట్ ధరించకుండా తన బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. నారాయణపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ.. హెల్మెంట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో షూట్ చేసి, ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులో అప్‌లోడ్ చేశాడు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి ఆ వీడియో నారాయణపేట ఎస్‌ఐ శ్రీనివాస్ వద్దకు చేరడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు పోలీసుకు రూ.1335 జరిమానా విధించారు.

A Police man fined Rs.1335 for violating Traffic Rules