Saturday, April 20, 2024

‘అజర’లో అరుదైన గుండె శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్ ప్రతినిధి: వరంగల్‌లో మొట్టమొదటిసారిగా నాలుగేళ్ల చిన్నారికి గుండెలో రంధ్రం మూసి వేయడం కోసం అజర ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించారు. సహజంగా గుండెలో రంధ్రం అనేది జన్మతావచ్చే అవకాశం ఉంది. దీనిని ఆరునెలల వయసులోపు శస్త్ర చికిత్స ద్వారా నయం చేయాల్సి ఉంటుంది. కాని బాధిత చిన్నారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో గుండెలోని రంధ్రం వయసుతో పాటు పెరుగుతూ వచ్చి చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు చిన్నారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పలు ఆస్పత్రుల్లో చూపించగా శస్త్ర చికిత్సకు సంబంధించిన రిస్కు, అయ్యే ఖర్చులకు భయపడి నిస్సాహయస్థితిలో వరంగల్ నగరంలోని అజర ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించారు.

చిన్నారి దీనస్థితిని, ఆర్థిక పరిస్థితులను గమనించిన వైద్యులు వారికి ధైర్యమిచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా గుండె శస్త్ర చికిత్స చేసి రంధ్రాన్ని మూసేశారు. ఈసందర్భంగా కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ రిషిత్, డాక్టర్ సృజన్‌లు మాట్లాడుతూ.. చిన్నారికి ఇన్నాళ్లు చికిత్సను వాయిదా వేయడం వల్ల గుండెలోని రంధ్రం ఒకరూపాయి బిల్ల సైజులో పెద్దదైందని, దీనివల్ల ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని తెలిపారు. క్లిష్టమైన ఈశస్త్రచికిత్సకు అనస్థీషియా బృందం, పిల్లల వైద్యులు, నర్సులు, అధునాతన సౌకర్యాలు చాలా అవసరమని వారు తెలిపారు. ఇవన్నీ అజర ఆస్పత్రిలో ఉండడం వల్లే శస్త్ర చికిత్స విజయవంతమైందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్స పూర్తయిందని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News