Thursday, March 28, 2024

పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక ప్రగతిపై పరిశ్రమల అధికారులతో సమాక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి చేపట్టుతున్న సంస్కరణలతోనే రాష్ట్రానికి జాతీయ, అంజర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్తు సమస్యతో చాల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యుత్ సమస్య నుంచి రాష్ట్రం బయటపడిందన్నారు. దాంతో పరశ్రమలు మల్లి పుంజుకున్నాయన్నారు.పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో ఎన్నొ కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు.మెడికల్ డివైజ్ పార్కులతో పాటు ఎల్‌ఈడి బల్బుల యునిట్, ఫార్మ కంపెనీలు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో జిఎం ప్రశాంత్, జొనల్ మెనేజర్ అనురాధ, వెంకటయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News