Home జాతీయ వార్తలు వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ

వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ

A stormy session is expected in Parliament today

 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.  ఈ బిల్లులను ఆమోదించడానికి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ రాజ్యసభలో పైచేయి సాధిస్తుందని సభ్యలు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో 245 మంది సభ్యుల ఉండగా, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు  స్పష్టమైన మెజారిటీ లేదు. వ్యవసాయ బిల్లులు లోక్ సభలో ఇప్పటికే ఆమోదం పొందాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ వారంలో ప్రారంభం కాగా, అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో సమావేశాలను కుదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులతో సహా సుమారు 30 మంది ఎంపిలు కరోనా బారిన పడ్డారు.

 

A stormy session is expected in Parliament today