Home ఎడిటోరియల్ తుపాకీ మెడపై ఫ్లోరిడా కత్తి!

తుపాకీ మెడపై ఫ్లోరిడా కత్తి!

EDIT

ఫ్లోరిడా స్కూలులో ఇటీవల సస్పెండైన ఒక విద్యార్థి 17 మంది సహవిద్యార్థులను, టీచర్లను దారుణంగా తుపాకీ తో కాల్చిచంపిన ఘటన అమెరికాలో తుపాకుల సంస్కృతిపై ఏవగింపును పెంచింది. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో తమ మిత్రులను తాజా ఘటనలో కోల్పోయిన ఫ్లోరిడా విద్యార్థులు ఈ సంస్కృతిని దేశం నుండి తరిమేయాలని ప్రతిన పూనారు. వారు చేపట్టిన ఉద్యమ ఫలితంగా తుపాకి సంస్కృతిపై సాగుతున్న చర్చ హఠాత్తుగా తీవ్రత సంతరించుకుంది. త్వరలో అమెరికాలో ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే అధికార పదవులకు జరగనున్న మధ్యంతర ఎన్నికలను ఈ ఉద్యమం ప్రభావితం చేసే అవకాశం ఉంది. తన తోటి విద్యార్థులను ఈ దారుణంలో కోల్పోయిన డేవిడ్ హోగ్ అనే విద్యార్థి ఈ ఉద్యమానికి సారధ్యం వహిస్తున్నాడు. తనలాగే మిత్రులను కోల్పోయిన మరికొంతమంది సహవిద్యార్థులను కలుపుకుని ముందుకు సాగుతున్నాడు. తుపాకుల అమ్మకాలను నియంత్రించడంలో చట్టసభ సభ్యులు తోడ్పడాలన్నది వారి డిమాండ్. తుపాకుల సంస్కృతికి అనుకూలం గా వ్యవహరిస్తున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్‌ఆర్‌ఎ) నుంచి నిధులను స్వీకరించవద్దని వారు రాజకీయ వేత్తలను డిమాండ్ చేస్తున్నారు. మార్చి 14న ఈ అంశంపై జాతీయ స్థాయిలో ‘స్కూల్ వాకౌట్’ నిర్వహించాలని ఉద్యమకారులు పిలుపు నిచ్చారు. 10 రోజుల తరువాత వాషింగ్టన్‌లో ‘మన ప్రాణాలకోసం యాత్ర’ కార్య క్రమాన్ని కూడా వారు తలపెట్టారు. అమెరికాలో చాలాకాలం గా తుపాకుల సంస్కృతిపై చర్చ సాగుతోంది. ఈ చర్చలో తుపాకులు కలిగి ఉండడాన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారుగా అమెరికా పౌరులు చీలిపోయి వున్నారు. సామూహిక కాల్పుల ఘటనలను తక్షణం నివారించాలని ప్రజలలో కొందరు గట్టిగా డిమాండ్ చేస్తు న్నారు. నవంబర్‌లో జరుగనున్న ఎన్నికలపై ఈ విద్యార్థులు ఇప్పుడు దృష్టిపెట్టారు. ఈ ఏడాది మొదటిసారి ఓటుహక్కు వినియోగించ బోతున్న విద్యార్థులకు వారు ప్రత్యేకంగా విజ్ఞప్తిచేస్తున్నారు. అంతే కాకుండా ఓటర్లందరూ తుపాకి హక్కులపై నియంత్రణ సాధిం చాల్సిన పరిస్థితిని ఓటింగ్ సమయంలో దృష్టిలో పెట్టుకోవాలని వారు కోరుతున్నారు. చాలాఏళ్లుగా వస్తున్న సలహాల కంటే ఈ విషయంలో కొద్ది రోజులలోనే వీరి ఉద్యమం గట్టి ప్రభావాన్ని చూపు తోందన్న వార్తలు వినపడుతున్నాయి.
తుపాకుల సంస్కృతిని నియంత్రించాలన్న డిమాండ్‌ను అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్‌లు వ్యతిరేకిస్తున్నారు. తుపాకులు కలిగి ఉండడం రాజ్యాంగ హక్కని వాదిస్తున్నారు. జాతీయ రైఫిల్ సంఘం ఎన్‌ఆర్‌ఎకు నిధులివ్వడం మానాలని దాని దాతలను విద్యార్థులు కోరుతున్నారు. రాజకీయంగా ఎంతో పలుకుబడి గల ఈ గ్రూపునుంచి నిధులు తీసుకోవద్దని కాంగ్రెస్ సభ్యులపై కూడా వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ యుక్తవయసు ఉద్యమ కారులు ఓప్రావిన్ ఫే, జార్జి క్లూని వంటి సెలబ్రిటీల నుంచి లక్షలాది డాలర్ల విరాళాలు ఈ సరికే సేకరించారు. హాలీవుడ్‌లోని ప్రముఖులు కొందరు వీరి ఉద్య మానికి ప్రచారం కల్పించడంలో సహకరిస్తు న్నారు. ప్రత్యేకంగా ఈ డిమాండ్‌తో మహిళల యాత్రను నిర్వహించ టానికి ఉద్యమ కారులు సంకల్పించారు. ఫ్లోరిడా వద్ద పార్క్‌లాండ్ ప్రాంతంలోని స్కూలులో ఇటీవల జరి గిన కాల్పుల ఘటన అమెరికాలో తుపాకి సంస్కృతికి తెరపడాలన్న డిమాండ్‌ను తెరమీదికి బలంగా తీసుకువచ్చింది. సోషల్ మీడియా లో ఉద్యమం ప్రచారం విస్తృతంగా సాగించడం ఈ విద్యార్థులు సాధించిన ఘనత. ఉద్యమ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రసంగాలు సామాజిక మీడియాలో విశేషంగా ప్రాచుర్యం పొందు తున్నాయి. ఇది అమెరికా యువతరంలో ఊహించని తుపానును సృష్టిస్తోంది. నిర్వహణపరమైన పకడ్బందీ ఏర్పాట్లతో విద్యార్థి ఉద్యమకారులు ముందుకు సాగుతున్నారని సివిక్ మీడియా నిపుణు లు ప్రశంసిస్తున్నారు. ఈ టీనేజర్లకు డెమొక్రాట్లనుంచి విశేషంగా మద్దతు లభిస్తోంది. ఈ ఉద్యమం ఫలితంగా యువడెమొక్రాట్ ఓటర్లు రానున్న ఎన్నికలలో పెద్దగా పాల్గొనకుండా ఎన్నికలకు దూరం పాటిస్తారని వారు భావిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని అధికారిక పదవులలోని వారు రాజీనామా చేయగా, కొందరిని ట్రంప్ తొలగిం చారు. ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే ఆ పదవులకు త్వరలో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది వేరువేరు తేదీలలో ఈ ఎన్నికలు జరుగు తాయి. వాటిపై ఉద్యమప్రభావం ఉండవచ్చు. ఈ విద్యార్థి ఉద్యమంపై రిపబ్లికన్‌లు పెదవి విరుస్తున్నారు. అది ఫ్లోరిడా ను మించి వ్యాపించదని జోస్యం చెబుతున్నారు.తమ ఉద్యమంపై వ్యాఖ్యానించవలసిందిగా ఎన్‌ఆర్‌ఎను విద్యార్థులు కోరారు. అయితే అది ఇంతవరకు మౌనం పాటించింది. పార్కు లాండ్ కాల్పుల ఘటనను డెమొక్రాట్లు రాజకీయం చేస్తున్నారని ఇటీవల ఎన్‌ఆర్‌ఎ పెద్దలు బాహాటంగా విమర్శించారు. వారు చాలా కాలం నుంచి తుపాకుల నియంత్రణ సలహాదారులను తప్పుపడు తున్నారు. అనేక అమెరికా కాలేజీలు, యూనివర్శిటీలతో పాటు 3 ఐవి లీగ్ స్కూళ్ల విద్యార్థులు కూడా ఫ్లోరిడా విద్యార్థులకు మద్దతు పలుకు తున్నారు. శనివారం నాడు తమ ఉద్యమంపై ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేస్తూ, రానున్న సెలవు లలో ఉద్యమంలో ఉధృతంగా చేరాలని హోగ్ పిలుపు నిచ్చారు.
2012లో కూడా తుపాకి కాల్పులలో అనేకమంది విద్యార్థులను ఊచకోత కోసిన ఘటనలు జరిగాయి. అప్పటినుంచి తుపాకులు కలిగి ఉండడాన్ని నిషేధించాలని ఆ సంస్కృతి నియంత్రణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రతిపాదనలను అప్పట్లో సృష్టించారు. ప్రస్తుత ఉద్యమంలో ఆ ప్రతిపాదనలు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. గన్‌మాగ్ డాట్ కామ్ సీనియర్ ఎడిటర్ డేవ్ వర్క్‌మాన్ విద్యార్థి ఉద్యమ కారులవంటి తుపాకుల నియంత్రణ గ్రూపులు ఉన్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ‘సెకండ్ ఎమెండ్‌మెంట్ ఫౌండేషన్’ పేరిట తుపాకీ హక్కుల గ్రూపు చేసే వాదనలను ఆ పత్రిక విశేషంగా ప్రచురిస్తూ ఉంటుంది. తమకు ఏ ఒక్కరి ఆమోదముద్ర అవసరం లేదని విద్యార్థి ఉద్యమకారులు అంటున్నారు. తాము రిపబ్లికన్, డెమొక్రాట్‌లో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉద్యమం చేయ టం లేదని, భవిష్యత్‌లో కూడా అదే వైఖరి కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. రెండు పార్టీల రాజకీయ వాదులు ఈ విషయం లో అవినీతిపరులని హోగ్ విమర్శించాడు. 2016లో ఫ్లోరిడాలోని ఓర్లాండో వద్ద పల్స్ నైట్ క్లబ్ కాల్పుల ఘటనలో బ్రతికి బయటపడ్డ బ్రాండన్ ఉల్ఫ్ పార్క్‌లాండ్ స్కూలు విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశం సించారు. ఇది ఏళ్లతరబడి పేరుకున్న స్తబ్దతను ఛేదించే ఉద్యమమని పేర్కొన్నారు.
* ఆండ్రూ హే