Tuesday, April 16, 2024

అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకుని మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జువెనైల్ కోర్టులో మేజర్‌గా పరిగణిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరుగగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ ఫోక్సో చట్టం కింద విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటేన్సీ టెస్ట్ నిర్వహించి మేజర్‌గా పరిగణించాలని జువెనైల్ కోర్టును పోలీసులు కోరారు.

పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు నిందితుడిని మేజర్‌గా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జువెనైల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు జువెనైల్ కోర్టు తీర్పును తప్పు పడుతూ నిందితుడు మైనర్ అంటూ తీర్పును వెలువరించింది. అమ్నేషియా పబ్ కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ 2022 సెప్టెంబర్ 30న జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోర్టును పోలీసులు అభ్యర్ధించారు. ఈ మేరకు 2022 సెప్టెంబర్ 2న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2022 మే 28న స్నేహితులతో కలిసి ప్రెషర్స్ పార్టీకి వెళ్లిన మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News