Home జాతీయ వార్తలు చంటి స్నేహితుడితో ప్రధాని మోడీ…

చంటి స్నేహితుడితో ప్రధాని మోడీ…

 A small child Meets PM Modi 
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఓ చంటోడిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం పార్లమెంట్‌లోని తన కార్యాలయానికి వచ్చిన ఈ చిన్నారితో ప్రధాని మోడీ సరదాగా గడిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. బుడ్డోడితో దిగిన ఫోటోలను ప్రధాని మోడీ, తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో షేర్ చేశారు.
‘పార్లమెంటులో నన్ను కలిసేందుకు ఓ స్పెషల్ ఫ్రెండ్ వచ్చాడు’ అని ఆయన కామెంట్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో షేర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే, ప్రధానితో ఉన్న ఈ చిన్నారి ఎవరన్న విషయంపై నెటిజన్లో ఆసక్తికరమైన చర్చ మొదలైయ్యింది.

A very Special friend meets me: PM Modi