Home Default భర్త, పిల్లలకు విషం ఇచ్చి ప్రియుడితో లేచిపోయిన భార్య..

భర్త, పిల్లలకు విషం ఇచ్చి ప్రియుడితో లేచిపోయిన భార్య..

 

కరీంనగర్: ఓ మహిళ తన భర్త, పిల్లలకు విషం ఇచ్చి ప్రియుడితో వెళ్ళిపోయింది. జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈఘటన ఆలస్యంగా ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. ఉమా అనే మహిళ తన భర్త అంజయ్య, సిద్ధార్థ(11), మన్విత (4) అనే ఇద్దరు పిల్లలతో బురుగుపల్లి గ్రామంలో నివాసం ఉంటుంది. వారితోపాటే ఆమె అత్తమామలు రాజేశం, లక్ష్మి కూడా ఉంటున్నారు. అయితే, ఉమా పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఉండేందుకు అడ్డుగా ఉన్న తన కుటుంబాన్ని చంపాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా సెమియా పాయసం చేసి అందులో విషం కలిపి.. భర్త, పిల్లలు, అత్తమామలకి ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి పరారైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

A Woman elopes with boyfriend after poisoning family