మన తెలంగాణ / ఘట్‌కేసర్ : తండ్రిని కుమారుడు డబ్బులు అడగగా నిరాకరించడంతో, మనస్తాపానికి గురై కుమారుడు ఆత్మహత్య చెసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అన్నోజిగూడ రాజీవ్‌గృహకల్పలో నివాస ముంటున్న తలపతి చెన్నయ్య కుమారుడు, తలపతి కిషోర్(20) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కిషోర్ తనతండ్రికి రూ.50 అడగగా నీకు డబ్బులు ఎందుకని, తండ్రి ఇవ్వలేదు దీంతో ఇంట్లోకి వెల్లి, గది తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూడగా, కిషోర్ అపస్మారక స్తితికి చేరుకున్నాడు. ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతు మృతి చెందాడు. తన కొడుకు మధ్యనికి బానిసైతున్నాడని నిరాకరించినందుకు ఉరివేసుకున్నాడని ఆ తండ్రిబోరున విలపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -