Wednesday, March 22, 2023

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -

bike
నల్గొండ: డీవైడర్‌ను ఢీకోని ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని తుప్రాన్‌పేట్ చౌటుప్పల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదారాబాద్ నుంచి ఐలూరి సతీష్‌రెడ్డి(20)అనే యువకుడు తన స్వంత ఊరు గన్నవరంకు ద్విచక్రవాహనంపై బయల్దెరాడు. మార్గమద్యంలో చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట్ సమీపంలో వేగంగా వెళ్లి డివైడర్‌ను ఒక్కసారిగా డీకొట్టాడు. దీంతో సతీష్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హైదారాబాద్ మణికొండలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తున్నాడని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News