Friday, April 26, 2024

పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా?

- Advertisement -
- Advertisement -
Aadhaar Card Pan card Link Last Date
జూన్ 30 లోగా చేసుకోకపోతే రూ.10,000 జరిమానా

న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు ఆఖరు తేదీ సమీపిస్తోంది. ఈ నెల 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేకపోతే ఆదాయపు పన్ను శాఖ రూ .10,000 జరిమానా విధించే అవకాశముంది. లాక్‌డౌన్ కారణంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి ప్రభుత్వం చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆధార్‌పాన్ లింక్ చేసేందుకు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ప్రభుత్వం గడువు పొడిగించింది. 2018లో సుప్రీంకోర్టు ఆధార్ కార్డుపై తీర్పు వెలువరించిన తర్వాత 12 అంకెల గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ నంబర్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఐటి తప్పనిసరి చేసింది. పాన్‌తో ఆధార్ లింక్ చేసేందుకు టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించాలి. 567678 లేదా 56161 కు సందేశం పంపడం ద్వారా కూడా ఇది చేయవచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్ -ww.incometaxindiaefiling.gov.in ద్వారా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించవచ్చు.

Aadhaar Card Pan card Link Last Date

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News