*వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రామ్మోహన్‌రావు
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో:
రైతుల ఖాతాల ఆధార్ సీడింగ్ పెంచాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలతో ఆధార్ సీడింగ్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష న్ ఎకనామిక్ సపోర్టు స్కీమ్ గ్రామాల స్వచ్ఛత పరిశుభ్రతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రైతు ఖాతాలకు ఆధార్ సీడింగ్ గడువు ఫిబ్రవరి 25తో ముగియనున్నదని 24 ఫిబ్ర వరి వరకు పూర్తి చేయాలని తెలిపారు. అవ సరం ఉన్న షిప్టులను ఏర్పాటు చేసుకోవాలని, అవసరం బట్టి కంప్యూటర్‌లు ఏర్పాటు చేసుకొని వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో మన జిల్లా 13వ స్థానంలో ఉన్నదని తెలిపారు. రైతు ఖాతాలు 93 శాతం క్లియర్‌గా ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుందని అన్నారు. రైతులతో ఎస్‌ఎంఎస్ ద్వారా వాట్సప్ ద్వారా ఆధార్ నెంబర్ తీసుకొని సీడింగ్ చేయాలన్నారు. పాస్ పుస్తకాలు వెరిఫికేషన్, ఆధా ర్ సీడింగ్ ప్లాన్ ప్రకారం చేసి ఫిబ్రవరి 24 వరకు పూర్తి చేయాలన్నారు. ఎస్సీ కార్పొ రేషన్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఎక నామిక్ సపోర్టు స్కీములు గిరిజన సంక్షేమ శాఖ 253, ఎస్సీ, కార్పొరేషన్ 290 ఎక నామిక్ సపోర్టు స్కీము మంజూరు అయిన వాటికి డయల్ అకౌంట్ తెరిపిం చాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఎంపిడివోలు గ్రామాల వారీగా స్వచ్ఛ గ్రామంగా తీర్చిది ద్దేందుకు చర్యలు తీసుకుని పంచాయతీ సెక్ర టరీ, శానిటరీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలని, శానిటరీ సిబ్బంది గ్రామం శుభ్రం గా ఉంచాలని తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని దీనిపై ఎంపిడివోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్వో ఇన్ ఛార్జ్జ్ వినోద్‌కుమార్, ఇన్‌ఛార్జ్ ఎస్సీ కార్పొరేష న్ శాంతికుమార్, డిటిడబ్ల్యువో స్వరూపరాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.