Home బిజినెస్ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ తప్పనిసరి

బ్యాంక్ ఖాతాలకు ఆధార్ తప్పనిసరి

  • రూ.50 వేలపైన నగదు లావాదేవీలకూడా ఉండాల్సిందే..
  • డిసెంబర్ 31 వరకల్లా ఇవ్వకపోతే ఖాతాలు చెల్లవు: ప్రభుత్వం

Bank-Accounts

న్యూఢిల్లీ: ఆధార్ కార్డును ప్రతి దానికీ అనుసంధానం చేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా ఇలాంటిదే మరో నిర్ణ యం తీసుకుంది. బ్యాంకు ఖాతా ఓపెన్ చెయ్యడానికి ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అదే విధంగా రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ నగదు లావా దేవీలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనని పేర్కొంది. అంతే కాదు ప్రస్తుతం ఆధారు కార్డు సంఖ్య అనుసంధాన చేయ కుండా ఖాతాలను కల్గి ఉన్నవారు కూడా గడువులోగా అందజేయాలనని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొం ది. యుఐడిఎఐ(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) జారీ చేసిన ఆధార్ కార్డును ఖాతాదారులు 2017 డిసెంబర్ 31 వరకల్లా సమర్పించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈలోగా బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను జత చేయకపోతే వాటిని చెల్లనివిగా గుర్తిస్తారు. ఈ మేరకు రెవె న్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 బడ్జెట్ ప్రసం గంలో పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)తో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలని ప్రకటించిన విషయం తెలిసిం దే. పన్ను ఎగవేతదారుల బహుళ పాన్ కార్డులను విని యోగిస్తున్న నేపథ్యంలో ఆధార్‌తో లింక్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ నియంత్రణ నిబంధనల సవరణ కింద పాన్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్‌కు ఆధా ర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని పలుసార్లు విచారించిన అనంతరం గతవారమే సుప్రీంకోర్టు దీన్ని సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఎవరైతే ఈ ఆధార్ సంఖ్య కలిగి ఉంటారో వారి పాన్ కార్డుకు దాన్ని అను సంధానం చేసుకోవాలని కోర్టు చెప్పింది. అయితే ఆధార్ కార్డు లేనివారి విషయంలో దీన్ని పట్టుబట్టరాదని పేర్కొం టూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వెనువెంటనే ఆధార్ కార్డు తప్పనిసరిపై మరో కొత్త ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటరన్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) పేర్కొంది.
కేంద్రంపై మమత ఆగ్రహం
బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై పశ్చి మబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల నిరుపేదలు అత్యంతగా బాధప డాల్సి వస్తుందని అన్నారు. ఆధార్ తప్పనిసరి నిబంధన ఏకపక్ష నిర్ణయమని ట్విట్టర్ ద్వారా ఆమె పోస్ట్ చేశారు. ఆధార్ కార్డు అనుసంధానంతో గోప్యతా అంశాలు దాగి ఉంటాయని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాడానికి ముం దు కేంద్రం దేశ పౌరుల భద్రతకు హామీ ఇవ్వాల్సి ఉం టుందని అన్నారు. గోప్యతకు సంబంధించి ఆధార్ తీవ్రంగా పరిగణించాల్సి విషయమని అన్నారు.