Wednesday, April 24, 2024

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీచేయనున్న ఆప్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అన్ని స్థానాలకు పోటీచేయనున్నట్లు ఆ పార్టీ నాయకురాలు ఆతిషి తెలిపారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్కుల మాదిరి ‘నమ్మ క్లినిక్’లను ఏర్పాటు చేయనున్నట్లు బిజెపి వాగ్దానం చేయగా, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అమలుచేస్తున్నట్లుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తామని వాగ్దానం చేసింది. కర్నాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్నట్లు ఆప్ తెలిపింది. మూడు నెలల లోపే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.మార్చి మొదటి వారంలోగా అభ్యర్థుల జాబితాను కూడా ఆప్ ప్రకటించనున్నది. ఈ వివరాలను ఆప్ నాయకురాలు విలేకరుల సమావేశంలో తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ తమ పథకాలను కాపీ కొట్టే పార్టీలని ఎద్దేవ చేశారు.

కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన మేరకు కర్నాటక ఎన్నికల తేదీ కంటే ముందు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఉచిత విద్యుత్తు ఇస్తే, కర్నాటకలో కూడా ఆ పార్టీ ఉచిత కరెంటు ఇస్తుందని నమ్మవచ్చు అన్నారు. జనతాదళ్ (ఎస్) నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతోందన్నారు. కర్నాటకలో ఆప్‌ను గెలిపిస్తే నాణ్యమైన విద్య, నాణ్యమైన హెల్త్‌కేర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ఆతిషి తెలిపారు. ఆప్ మొత్తం 224 స్థానాలలో పోటీచేస్తోందని, ప్రజలు హామీలు నెరవేర్చే నిజాయితీ ఉన్న పార్టీనే ఎన్నుకోవాలని ఆమె అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News