Thursday, April 25, 2024

యాదాద్రిలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ది దేవుడు శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రములో ఆరు రోజులపాటూ అత్యంత వైభవంగా జరిగిన అధ్యయనోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. యాదాద్రి క్షేత్రములో ఈనెల 2వ తేదినుండి 7వతేది వరకు సాగిన ఆలయ అధ్యయనోత్సవాలు శ్రీ పాంచరాత్ర ఆగమరీత్య శాస్త్రనుసారము ఉదయం సాయంత్రము పూజలను నిర్వహించి లోక రక్షణ గావించిన శ్రీ మహావిష్ణు అవతార రూపాలతో అలంకరించి భక్తకోటికి శ్రీలక్ష్మీనరసింహుడు దర్శనమిచ్చాడు. శనివారము ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరము శ్రీలక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అర్చకులు, వేద పండితులు శ్రీ నరసింహ స్వామి ఆవతార రూపిడిగా అలంకరణచేసి ఆళ్వారాదుల ముందు ప్రబంధ పారాయణములు పారాయణికులచే గావించి పూజలను నిర్వహించారు.

అనంతరము శ్రీవారి అలంకార సేవను మేళతాళముల మద్య, వేద మంత్రోచ్చారణగావిస్తు ఆలయ తిరువీదులలో ఊరేగించగా భక్త జనులు శ్రీలక్ష్మీనరసింహ స్వామి అలంకార సేవను దర్శించుకొని తరించారు.ఉత్సవ మండపములో అలంకార సేవను వేచింపచేసి శ్రీ నరసింహ స్వామి అవతార విశిష్టతను భక్తులకు తెలియ చేశారు. కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు సింహముఖముతో నరుడి శరీరములో అవతరించిన అపూర్వ అవతారము శ్రీ నరసింహ స్వామి అవతరాముగా తెలిపారు. భూలోకములో శ్రీ స్వామి అనేక రూపములో దర్శనమిచ్చిన ఆయన యాదాద్రి క్షేత్రములో పంచనారసింహుడిగా స్వయంభువై భక్తులను సంరక్షిస్తున్నడని తెలిపారు.

అనంతరము శ్రీ స్వామి వారి ఆలయంలో ఉత్సవ మూర్తులకు తిరుమంజన, నవకలశస్నపన మహోత్సవములను, రామానుజనుత్తందాది ఉపదేశరత్తినమాలై అనుసందానం గావించి అధ్యయనోత్సవాలు పరిసమాప్తి గావించారు.ఈ మహోత్సవ వేడుకలలో ఆలయ ప్రధానర్చకులు నల్లందీగల్ శ్రీలక్ష్మీనరసింహ చార్యులు, ఉప ప్రధానార్చకులు కాడూరి వెంకటాచార్యులు, సురెంద్ర చార్యులు, మాదవ చార్యులు, వేద పండితులు శ్రీనావాస శర్మ, అర్చకుల బృదం, పారాయణికులు పూజలు నిర్వహించగా ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ ఈవో గీత, ఆలయ ఉద్యోగ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి యధావిధిగా అర్జిత సేవలు….

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధ్యయనోత్సవాల సందర్బంగా ఆరు రోజులపాటు భక్తులచే జరిపించబడు అర్జిత సేవలు సుదర్శన హోమం,నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడి సేవ పూజలు నేటి నుండి యధావిధిగా కోనసాగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News