Home తాజా వార్తలు టి20ల్లో ఫించ్ ప్రపంచ రికార్డ్

టి20ల్లో ఫించ్ ప్రపంచ రికార్డ్

Aror-pinch

హరారె: ఆస్ట్రేలియా కెప్టెన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ ముక్కోణపు టి20ల్లో ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. ఫించ్ జింబాబ్వేతో జరిగిన ఆటలో కేవలం 76 బంతుల్లోనే 172 రన్స్ అదరహో అనిపించాడు. టి20 మ్యాచుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం. గతంలో తన పేరిట ఉన్న 156 పరుగుల రికార్డును ఆరోన్ ఫించ్ ఇప్పుడు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచులో జింబాబ్వే బౌలర్స్ ను చీల్చి చెండాడాడు. ఫించ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 50 బాల్స్‌లో 100 పరుగులు చేశాడు. తర్వాత మరో 26 బాల్స్‌లో 72 రన్స్ చేశాడు. ఆరోన్ ఫించ్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో చివరికి 172 పరుగుల వద్ద అతను హిట్ వికెట్‌ గా ఔవుట్  అయ్యాడు. ఫించ్ బాదుడుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 229 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకో టి20 వరల్డ్ రికార్డు కూడా నమోదు అయింది. డార్సీ షార్ట్‌తో కలిసి మొదటి వికెట్‌కి ఫించ్ 223 పరుగులు జోడించి, టి20ల్లో మొదటి డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ చేసిన రికార్డ్ నెలకొల్పారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ నెలకొల్పిన 171 పరుగుల రికార్డును బద్దలు కోట్టారు.